Aortic stenosis is a condition in which blood from the left side of the heart is not being ejected into the great artery (AORTA) due to the narrowing of the Aortic Valve (aortic stenosis). This condition is more common in the elderly age group. Patients will develop breathlessness, chest pain, loss of consciousness and sudden death due to this condition. Traditionally treatment for this condition is Aortic valve replacement by open heart surgery. But in patients with high surgical risk alternative to surgery is TAVI (Transcatheter Aortic Valve Implantation) in which the valve is replaced without opening the chest through a small hole in the thigh arteries.
The incidence of aortic stenosis increases with age with a prevalence of 5% in ages above 65 years. Nearly 3 lakhs patients with aortic stenosis in India are eligible for TAVI. Currently, the TAVI is being done in only 30 centers in India. So, there is a need to increase the number of TAVIS being performed in our country. This can be achieved by increasing the training centers and decreasing the cost of TAVI.
Last week two cases of very high-risk TAVI were performed at our hospital. The first case was a 69 years female who has already undergone Aortic valve replacement surgically and presented with severe breathlessness. Medical examination and echocardiogram showed severe stenosis of the surgically replaced valve. As repeat open heart surgery for valve replacement is a very high-risk procedure in her, the heart team in Ramesh hospitals suggested TAVI as an effective alternative. The challenge, in this case, is performing TAVI in a pre-existing diseased surgical valve. The coronary arteries (arteries supplying the blood to the heart muscle) originate very close to the valve in this patient. So, the other challenge is placing the TAVI valve without compromising these arteries. The cardiology team in Ramesh Hospital Vijayawada successfully overcame these challenges and performed this high-risk TAVI without any complications and the patient was relieved of symptoms and discharged on 3rd day. The second case is a 62-year female with a weight of 115 kg presented with recurrent episodes of breathlessness due to heart failure. On evaluation found to have severe aortic valve narrowing (aortic stenosis). As her morbid obesity imposes a high risk for surgical replacement of the valve, the heart team decided to perform TAVI, Like the previous patient other challenge is protecting low-lying coronary arteries. Again, our cardiology team performed TAVI in this obese female with no complications and she was discharged on 4th day.
ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిసారిగా రమేష్ హాస్పిటల్స్‌లో సంక్లిష్టమైన ‘ట్రాన్స్ క్యాధటర్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్’ (టావి) వాల్వ్ ఇన్ వాల్వ్ చికిత్స
అత్యంత క్లిష్టమైన రెండు ‘‘ట్రాన్స్ క్యాధటర్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్’’ (టావి) కేసులను రమేష్ హాస్పిటల్స్ ఈ వారంలో విజయవంతంగా నిర్వహించింది.
69 సంవత్సరాల వయస్సు కలిగిన ఒక మహిళకు 2019 నవంబర్‌లో హైదరాబాద్‌లో శస్త్ర చికిత్స ద్వారా అయోటిక్ వాల్వ్ మార్పిడి జరిగింది. ఊపిరి తీసుకోవటం క్లిష్టతరమైన స్థితిలో ఆ మహిళను కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తీసుకురావటంతో ఆమెకు గుండె వ్యాధి పరిక్షలు నిర్వహించగా ఎకో కార్డియోగ్రాం పరీక్షలో శస్త్ర చికిత్స ద్వారా అమర్చిన వాల్వ్ బాగా సన్నబడిపోవటం వలన ఇబ్బంది పడుతున్నారని వ్యాధి నిర్థారణ అయింది. తిరిగి మరల శస్త్ర చికిత్స ద్వారా వాల్వ్ మార్పిడి అత్యంత క్లిష్టతరమైన ప్రక్రియ అని రమేష్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్టు డాక్టర్ పోతినేని రమేష్ బాబు ఆధ్వర్యంలోని హార్ట్ టీమ్ నిర్థారణకు వచ్చి శస్త్ర చికిత్సకు ఖచ్చితమైన ప్రత్యామ్నాయంగా ఇన్వేజివ్ విధానంలో వాల్వ్ మార్పిడి చికిత్సను సూచించి ‘‘ట్రాన్స్ క్యాధటర్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్’’ను (టావి) విజయవంతంగా నిర్వహించారని తెలియచేసారు.
ఈ కేసులో ప్రధానమైన సవాలు ఏమిటంటే ఇప్పటికే శస్త్ర చికిత్స ద్వారా వాల్వ్ మార్పిడి అయి వుండటం, గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులకు ఈ వాల్వ్ దగ్గరగా ఉండటం కారణాల వలన ధమనులకు ఎటువంటి హాని లేకుండా వాల్వ్‌ను ఇన్వేజివ్ పద్దతిలో అమర్చటం అనేది ఎంతో క్లిష్టతరమైనదని డాక్టర్ పోతినేని రమేష్ బాబు తెలియచేసారు.
62 సంవత్సరాల వయస్సు, 115 కిలోల బరువు కలిగిన ఇంకొక మహిళకు తరచుగా ఊపిరి తీసుకోవటంలో ఇబ్బందితో హార్ట్ ఫెయిల్యూర్ స్థితిలో హాస్పిటల్స్‌కు రావటం జరిగింది. హార్ట్ టీమ్ గుండె వైద్య పరీక్షలు నిర్వహించి అయోటిక్ వాల్వ్‌లో తీవ్రమైన ఇబ్బందులున్నట్లు గుర్తించి వయస్సు, ఒబేసిటీ మరియు ఇతర రిస్క్ ఫ్యాక్టర్ల దృష్ట్యా శస్త్ర చికిత్స కన్నా ‘టావి’ విధానంలో వాల్వ్ మార్పిడి చికిత్స అత్యుత్తమని భావించి విజయవంతంగా చికిత్సను నిర్వహించామని డాక్టర్ పోతినేని రమేష్ బాబు తెలియచేసారు.
బృహద్ధమని కవాట సమస్యలు 65 సంవత్సరాల వయస్సు దాటిన వారిలో 5 శాతం మందికి వచ్చే అవకాశాలున్నాయని భారతదేశంలో సుమారుగా 3 లక్షల మందికి ‘‘ట్రాన్స్ క్యాధటర్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్’’ ‘టావి’ చికిత్స ద్వారా శస్త్ర చికిత్సలేకుండా ఇంటర్వెన్షనల్ వైద్య విధానంలో కవాటం మార్చవచ్చని ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ పోతినేని రమేష్ బాబు తెలియచేసారు. మన దేశంలో ఇటువంటి వైద్య చికిత్స అందించే సెంటర్లు 30 మాత్రమే ఉన్నట్లు ‘టావి’ వంటి అధునాతన వైద్య చికిత్సల ద్వారా జీవన ప్రమాణాలను, ఆయుర్థాయాన్ని పెంపొందించవచ్చని తెలియచేసారు.
60 సంవత్సరాల వయస్సు దాటిన వారిలో బృహద్ధమని కవాటం సన్నబడిపోవటం కారణంగా ఎడమవైపున వుండే ధమనుల ద్వారా రక్తాన్ని గుండెకు సరిగ్గా సరఫరా చేయలేకపోవటం తద్వారా రోగులకు ఆయాసం, ఛాతినొప్పి, స్పృహ కోల్పోవటం అనే తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతాయని వీటికి పరిష్కారం ‘టావి’ చికిత్సేనని ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజా రమేష్ తెలియచేసారు.
రమేష్ హాస్పిటల్స్‌లో ఇప్పటి వరకు 8 ‘టావి’ కేసులు విజయవంతంగా నిర్వహించామని ఆంధ్రప్రదేశ్‌లోనే మొట్టమొదటి సారిగా కెరోటిడ్ రక్తనాళాల ద్వారా వాల్వ్‌ను అమర్చామని ఇప్పుడు ‘వాల్వ్ ఇన్ వాల్వ్’ కేసును దిగ్విజయంగా నిర్వహించామని రమేష్ హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ పావులూరి శ్రీనివాస్ తెలియచేసారు.